Telangana Global Summit 2025
Global Summit 2025 : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని భారత్ ఫ్యూచర్ సిటీలో రెండ్రోజులు ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. తొలిరోజు సోమవారం పెట్టుబడులు వెల్లువెత్తాయి.
గ్లోబల్ సమ్మిట్ లో (Telangana Global Summit 2025) భాగంగా తొలిరోజు సోమవారం పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకేరోజు 35పైగా ఎంవోయులను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. తొలిరోజు మొత్తం 2.43లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదం చేస్తాయన్న మంత్రులు తెలిపారు.
మరోవైపు.. రెండోరోజు (మంగళవారం) కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ ఉదయం 10గంటల నుంచి గ్లోబల్ సమ్మిట్ కొనసాగనుంది. ఉదయం 10 గంటల వరకు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలుదేశాల ముఖ్యులు, పారిశ్రామికవేత్తలు చేరుకుంటారు. లైఫ్ సైన్స్, తెలంగాణ ఒలంపిక్స్ గోల్డ్ క్విస్ట్, త్రీ ట్రిలియన్ ఎకానమికి చేరుకునే లక్ష్యాలపై సెమినార్స్ జరుగుతాయి. మూసి రివర్ రినోవేషన్, భారత్ ఫీచర్ సిటీ, క్యాపిటల్ అండ్ గ్రోత్ ఇన్వెస్ట్ అంశాలపై సెషన్స్‌లు కొనసాగుతాయి.
సాయంత్రం 6గంటలకు తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాత్రి 7గంటలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షో జరగనుంది. 3000 వేల డ్రోన్స్ తో ‘తెలంగాణ ఈజ్ రైజ్… కమ్ జాయిన్ ద రైజ్’ అనే క్యాప్షన్‌తో లేజర్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.