Holidays List 2026 : 2026లో సెలవుల లిస్ట్ ఇదే.. ఖరారు చేసిన తెలంగాణ సర్కార్.. మొత్తం ఎన్ని సెలవులంటే? నెలనెలా లిస్ట్ ఇదే..

Holidays List 2026 : 2026 సంవత్సరంలో సెలవులకు సంబంధించిన లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై ..

Holidays List 2026 : 2026లో సెలవుల లిస్ట్ ఇదే.. ఖరారు చేసిన తెలంగాణ సర్కార్.. మొత్తం ఎన్ని సెలవులంటే? నెలనెలా లిస్ట్ ఇదే..

Telangana Govt Holidays List 2026

Updated On : December 9, 2025 / 8:19 AM IST

Holidays List : 2025 సంవత్సరం మరికొద్దిరోజుల్లో ముగియబోతుంది. 2026 సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే, 2026 సంవత్సరంలో సెలవులకు సంబంధించిన లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Vantara Zoo Park: ఫ్యూచర్ సిటీలో వంతారా జూపార్క్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం..

2026 సంవత్సరంలో మొత్తం 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించిన ప్రభుత్వం. ఇందులో సంక్రాంతి, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అన్ని ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం మూసి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్, బక్రీద్ వంటి పండుగల తేదీల్లో చంద్రదర్శనం ఆధారంగా ఏవైనా మార్పులు ఉంటే, వాటిని మీడియా ద్వారా ముందుగానే తెలియజేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సాధారణ సెలవులతో పాటు.. మరో 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనవరి 1 న్యూ ఇయర్, కనుమ, వరలక్ష్మీ వ్రతం తదితర పండుగలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ జాబితా నుంచి తమ ఇష్టానుసారం, ముందస్తు అనుమతితో ఏడాదిలో గరిష్ఠంగా ఐదు ఐచ్ఛిక సెలవులను వినియోగించుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది.

నెలవారీగా సెలవుల లిస్ట్ ఇదే..
జనవరి 14 (బుధవారం) : భోగి
జనవరి 15 ( గురువారం) : సంక్రాంతి లేదా పొంగల్
జనవరి 26 (సోమవారం) గణతంత్ర దినోత్సవం.
ఫిబ్రవరి 15 (ఆదివారం) : మహాశివరాత్రి
మార్చి 3 (మంగళవారం) : హోలీ
మార్చి 19 (గురువారం) : ఉగాది
మార్చి 21 (శనివారం) : రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్).
మార్చి 22 (ఆదివారం) : రంజాన్ తరువాతిరోజు
మార్చి 27 (శుక్రవారం) : శ్రీరామనవమి
ఏప్రిల్ 3 (శుక్రవారం) : గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5 (ఆదివారం) : బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 14 (మంగళవారం) : బి.ఆర్. అంబేద్కర్ జయంతి
మే 27 (బుధవారం) : బక్రీద్
జూన్ 26 (శుక్రవారం) : మొహర్రం
ఆగస్టు 10 (సోమవారం) : బోనాలు
ఆగస్టు 15 (శనివారం) : స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 26 (బుధవారం) : ఈద్ మిలాద్ -ఉన్-నబీ
సెప్టెంబర్ 4 (శుక్రవారం) : శ్రీకృష్ణ అష్టమి
సెప్టెంబర్ 14 (సోమవారం) : వినాయక చవితి
అక్టోబర్ 2 (శుక్రవారం) : మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 18 (ఆదివారం) : సద్దుల బతుకమ్మ
అక్టోబర్ 20 (మంగళవారం) : విజయదశమి
అక్టోబర్ 21 (బుధవారం) : విజయదశమి తరువాతి రోజు
నవంబర్ 8 (ఆదివారం) : దీపావళి
నవంబర్ 24 ( మంగళవారం ) : కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (శుక్రవారం) : క్రిస్మస్
డిసెంబర్ 26 (శనివారం) : క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)గా ప్రకటించింది.

ఐచ్ఛిక సెలవులు..
జనవరి 1 (గురువారం) : నూతన సంవత్సరం
జనవరి 3 (శనివారం) : హజ్రత్ అలీ జన్మదినం.
జనవరి 16 (శుక్రవారం) : కనుమ
జనవరి 17 (శనివారం) : షాబ్-ఎ-మెరాజ్
జనవరి 23 (శుక్రవారం) : శ్రీపంచమి
ఫిబ్రవరి 4 (బుధవారం) : షాబ్-ఎ-బరాత్.
మార్చి 31 : మహావీర్ జయంతి
మే 1 : బుద్ధ పౌర్ణమి
నవంబర్ 8 : నరక చతుర్దశి
డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్

Holidays List 2026

Optional Holidays