Vantara Zoo Park: ఫ్యూచర్ సిటీలో వంతారా జూపార్క్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం..
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.
Vantara Zoo Park: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో వంతారా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న కొత్త జూపార్క్ కు సంబంధించి సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం, అటవీ శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వంతారా ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్. జంతువుల సేవ అనే నినాదంతో వంతారా పని చేయడం అభినందనీయం అన్న సీఎం.. ఈ నెల చివరలో వంతారాని సందర్శిస్తామని తెలిపారు.
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం వంతారా నేషనల్ జూపార్క్ ని నిర్వహిస్తోంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.
Also Read: ఒక్కరోజే 2లక్షల కోట్లు..! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడుల వెల్లువ
