Telangana Rising Global Summit: ఒక్కరోజే 2లక్షల కోట్లు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడుల వెల్లువ
మైహోమ్ పవర్ పెట్టుబడులతో 12వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో తొలి రోజే భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ విద్యుత్ రంగంలో భారీగా ఒప్పందాలు జరిగాయి. ఒక్కరోజే 2లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో మైహోమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 7వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ ప్లాంట్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టనుంది. మైహోమ్ పవర్ పెట్టుబడులతో 12వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
2047 విజన్ తో తెలంగాణను మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ”తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారాయన. ”తెలంగాణలో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఏరో స్పేస్ రంగాల్లో, ఇండస్ట్రీస్, టూరిజం, హెల్త్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని గ్లోబల్ లెవెల్ లో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ సమ్మిట్ పెట్టాం” అని మంత్రి పొన్నం తెలిపారు.
”2047 లో 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలంటే చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సమ్మిట్ వల్ల ఫ్యూచర్స్ నీడ్స్ ఏమున్నాయి, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఎంప్లాయ్ మెంట్ స్కిల్ ఫోర్స్ ఏముంది.. ఇవన్నీ నా శాఖలోకి వస్తాయి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలని వచ్చినప్పుడు స్కిల్ ఫోర్స్, ట్రైన్డ్ ఫోర్స్ ఉందో లేదో చూస్తారు. అందుకోసం మా ప్రభుత్వం 115 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ రాష్ట్రంలో స్థాపించింది.
పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా ఐటీఎస్ కి పెట్టలేదు. అప్ గ్రడేషన్ లేదు. మిషనరీ లేదు. ఇవన్నీ చేంజ్ చేయడానికి టాటా సీఎస్ఆర్ ఫండ్స్ తో సుమారు 4వేల కోట్లు ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు 540 మందిని రిక్రూట్ మెంట్ చేసింది. దీని వల్ల ఏడాదికి 2లక్షల మంది ట్రైన్డ్ అయి బయటకు వస్తారు. దీని వల్ల ఇన్వెస్టర్లు వస్తారు, ఉద్యోగాలు కల్పించొచ్చు. 2047 తెలంగాణ రైజింగ్ విజన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతోంది” అని మంత్రి వివేక్ తెలిపారు.
Also Read: పూలమ్మిండు.. పాలమ్మిండు.. వేల ఎకరాలు కబ్జా పెట్టిండు..! మల్లారెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు..
