Telangana Government (Photo : Google)
Telangana Government : అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో, అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి విధానపరమైన నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల అటవీశాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అసాంఘిక దాడుల్లో అటవీశాఖ సిబ్బంది మరణిస్తే ఎలాంటి పరిహారం అందడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Also Read..Quthbullapur Constituency: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది?
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో.. అటవీ అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమణా రెడ్డి అన్నారు. ఇంతటి ఎక్స్ గ్రేషియా ఎక్కడ లేదన్నారు. ఇలాంటి జీవో ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటవీశాఖ అధికారుల మనోధైర్యాన్ని ప్రభుత్వం పెంచిందన్నారు. మరో రెండు జీవోలు ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఫారెస్ట్ ఆఫీసర్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. అటవీశాఖ అధికారులకు గన్స్ కూడా ఇస్తామని చెప్పారు.(Telangana Government)
Also Read..KTR: పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : కేటీఆర్
నరేందర్, తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ
”దాదాపు 5వేల మంది అటవీశాఖ అధికారులకు ఈ జీవో వర్తిస్తుంది. పోలీసులకు మాత్రమే ఇలాంటి ఎక్స్ గ్రేషియా వచ్చేది. అటవీశాఖ అధికారులు దాడుల్లో చనిపోతే ఇలాంటి పరిహారం వచ్చేది కాదు. ఇటీవల అటవీశాఖ అధికారి శ్రీనివాస్.. గుత్తికోయల దాడిలో చనిపోయారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇలాంటి దాడుల్లో చనిపోయిన వారికి ఆర్ధిక భరోసా లభిస్తుంది. అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని పెంచింది”.(Telangana Government)