Telangana Bhu Bharathi portal
Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా నారాయణపేట జిల్లా మద్దూరు, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో ప్రయోగాత్మకంగా పోర్టల్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ ను ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది.
భూభారతి అమల్లో భాగంగా ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒక స్థాయిలో కాకపోయినా రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇక అప్పీళ్లు మాత్రమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును మార్గదర్శకాల్లో వెల్లడించారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.
భూ సమస్యలకు ఎక్కడ..? ఎలా..? ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్ లైన్స్ లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
Also Read: Gossip Garage: వాళ్లు మాత్రమే ఎందుకు వాడాలి? మేము మంత్రులం కాదా? అమాత్యుల మధ్య గాలిమోటర్ చిచ్చు..
ఫీల్డ్ లో ఉన్న మేరకు భూమి రికార్డుల్లో చేరకపోతే, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది. అంటే వచ్చే ఏప్రిల్ 13 దాకా కరెక్షన్స్ కు చాన్స్ ఇచ్చారు.
దరఖాస్తుదారు పట్టాదార్ పాస్ బుక్, టైటిల్ డీడ్, పహాణీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేదా ఇతర ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారి దరఖాస్తుదారుకు, రికార్డుల్లో ఉన్న వ్యక్తులకు, హక్కుకోరే ఇతరులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందిన 7రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి. అభ్యంతరాలు లేకపోతే, మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
అధికారి భూ రికార్డులను పరిశీలించి, ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ నిర్వహించవచ్చు. విచారణ జరిపి 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ఆర్డర్ ను పోర్టల్ లో అందుబాటులో ఉంచి, పార్టీలకు తెలియజేస్తారు.