Christmas Celebrations : సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు

వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు తలసాని.

Crismas

Christmas Celebrations at lb Stadium : ఇవాళ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ వేడుకలకు హాజరై అతిథులకు విందును ఇవ్వనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ పరిశీలించారు.

వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు తలసాని. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి క్రిస్మస్‌ వేడుకలను సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

Telangana Ministers : నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ

క్రిస్మస్‌ వేడుకల కారణంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం వైపునకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. దీని ప్రకారం, బీజేఆర్‌ విగ్రహం వైపు వాహనాలను అనుమతించబోమని అధికారులు తెలిపారు. వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుంచి ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు అనుమతించరు.

ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్‌ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.