Breakfast Scheme: ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’పై ప్రభుత్వం కసరత్తు.. 33 జిల్లాల్లో కమ్యూనిటీ కిచెన్లు.. సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ఉపాహార పథకాన్ని(Breakfast Scheme) నవంబర్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
- V Santhosh Kumar
- Published on- August 27, 2026 / 07:57 AM IST
Telangana government expands school breakfast scheme 22 lakh students to benefit
- ప్రభుత్వ బడుల్లో ఉచిత ఉపాహారం
- అక్టోబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు
- 22 లక్షల మంది విద్యార్థులు
Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార భద్రతను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమైన అడుగులు వేస్తోంది. గత జూన్ నెలలో రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఉపాహార పథకానికి (Breakfast Scheme) విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. ఈ విజయవంతమైన అనుభవంతో, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు విస్తరించేందుకు విద్యాశాఖ, ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కసరత్తు పూర్తి చేస్తున్నాయి.
Iran Oman Deal: హార్ముజ్ జలసంధి వివాదం.. ఇరాన్-ఒమన్ మధ్య కీలక ఒప్పందం.. అమెరికాకు భారీ షాక్
అక్టోబర్ లేదా నవంబర్ నాటికి అమలు:
ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రాబోయే అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు వీలుగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల నిర్మాణం, ఏర్పాటు పనులను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ వంటశాలల ద్వారా ప్రతిరోజూ వేడివేడి టిఫిన్‌ను నిర్దేశిత సమయానికి స్కూళ్లకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి:
ప్రస్తుతం ఈ ఉపాహార పథకం ద్వారా 8 జిల్లాల్లోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రోజువారీ బ్రేక్‌ఫాస్ట్ అందుతోంది. అయితే ఈ విస్తరణ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి వచ్చే పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని, వారిలో పోషకాహార లోపాన్ని నివారించి చదువుపై శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
