Telangana Police jobs : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ప్రకటించిన టీఎస్ఎల్పీఆర్బీ
Telangana Police jobs Written Exam Dates : పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలను తాజాగా.. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29వ తేదీన, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
TSLPRB has announced written exam dates for police jobs in Telangana
Telangana Police jobs Written Exam Dates : హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలను తాజాగా.. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29వ తేదీన, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్ఐ పోస్టులకు 1,60,756 మంది, కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్టికెట్లు, పరీక్ష కేంద్రం, సమయం వంటి వివరాలను అధికారికంగా విడుదల చేసే సూచనల ప్రకారం పరిశీలించుకోవాల్సి ఉంటుందని సూచించారు.
పూర్తి వివరాలు ఇలా..
♦ మొత్తం పోలీసు ఉద్యోగాలు: 7,437
♦ మొత్తం దరఖాస్తుదారులు: 5,77,064
♦ ఎస్ఐ పోస్టులకు దరఖాస్తులు: 1,60,756
♦ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు: 3,89,356
♦ ఎస్ఐ రాతపరీక్ష : నవంబర్ 29
♦ కానిస్టేబుల్ రాతపరీక్ష : డిసెంబర్ 20
