KCR Farmhouse Lands : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు..
KCR Farmhouse Lands : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని భూముల్లో రెవెన్యూ అధికారుల ఫీల్డ్ విజిట్ నిర్వహించారు.
KCR Farmhouse Lands
KCR Farmhouse Lands : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేద దళితులకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఫామ్‌హౌస్ భూములపై అధికారులను విచారణకుసైతం ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం సిద్ధిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో సమావేశమై ఫామ్‌హౌస్ భూములపై సమీక్ష నిర్వహించారు.
గురువారం మధ్యాహ్నం సమయంలో ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. జిల్లా సర్వేయర్లు, తహసీల్దార్ సరితతో కలిసి గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ సమావేశం అయ్యారు. ఆ తరువాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారు. సర్వే నెంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్లపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ఆర్డీవో చంద్రకళ పరిశీలించారు.
మరోవైపు, శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు పర్యటించనున్నారు. కబ్జా ఆరోపణలున్న భూమలను వారు పరిశీలించడంతో పాటు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.
