Site icon 10TV Telugu

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్… ప్రతి సోమవారం అకౌంట్‌లో డబ్బులు..

Indiramma House Scheme

Indiramma House Scheme

Indiramma Indlu: రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంత ఇంటి నిర్మాణం చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకంను అమలు చేస్తోంది. మొత్తం 20లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 1,36,390 ఇండ్లకు సంబంధించి పనులు మొదలయ్యాయి. 1,347 ఇండ్లు స్లాబ్స్ పూర్తిచేసుకున్నాయి. 20,075 ఇండ్లు బేస్ మెంట్ పూర్తికాగా.. 3,871 ఇండ్లు గోడలు పూర్తయ్యాయి.

Also Read: KCR Health: కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్, బండి సంజయ్ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బంధీగా అమలు చేస్తుంది. తొలి దశలో సొంతంగా ఇంటి జాగా ఉండి.. పక్కా ఇల్లులేని పేదలను మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. కేవలం 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం ద్వారా కేవలం పేదలకు మాత్రమే ఇండ్లు దక్కేలా అధికారులు చూస్తున్నారు. మొదటి, రెండు విడతల్లో మొత్తం 3లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. వాటిని స్పీడప్ చేయడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది.

ఇందిరమ్మ ఇండ్ల పథకంకు నిధుల కొరత రాకుండా ప్రభుత్వం పడక్బంధీగా ముందుకుపోతుంది. ఇందులో భాగంగా గ్రీన్ చానల్ ద్వారా కేటాయింపులు చేస్తుంది. బేస్ మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఆయా దశలను బట్టి ప్రతిసోమవారం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16,563 మంది లబ్ధిదారులకు రూ.173.98 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అదే సమయంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించేందుకు చేతిలో డబ్బులు లేని వారికి మహిళా సంఘాల నుంచి రూ.లక్ష రుణాన్ని సైతం ప్రభుత్వం ఇప్పిస్తుంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఈ పథకం బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్లు కలెక్టర్లకు సమన్వయకర్తలుగా పనిచేస్తారు. గ్రూప్-1 అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూశాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version