KCR Health: కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్, బండి సంజయ్ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

KCR Health: కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్, బండి సంజయ్ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Updated On : July 3, 2025 / 10:45 PM IST

KCR Health: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనారోగ్యం పాలయ్యారు. యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు కేసీఆర్. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు పలు మెడికల్ టెస్టులు చేసింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

ఆసుపత్రి డాక్టర్లు, అధికారులతో ఆయన మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. మాజీ సీఎంకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు బండి సంజయ్.

అటు మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. నీరసంగా ఉండటంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ కు బ్లడ్ షుగర్ పెరిగిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ తగ్గాయని హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు డాక్టర్లు.