Telangana Govt : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత పదిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు, వరదల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం (Telangana Govt) పరిహారం అందించనుంది.
భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కింద 1.30 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను వర్షాలకు వ్యక్తుల, పశువుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్షాలు, వరదల కారణంగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా, ఎక్కువ పశువులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్ గ్రేషియాను అందించనున్నారు. అదేవిధంగా ఒక మేక/ఒక గొర్రె మాత్రమే చనిపోతే వారికి రూ.5వేలు ఎక్స్ గ్రేషియా అందించనున్నారు.
అయితే, ఈ పరిహారం.. కామారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, ములుగు, మహబూబ్ నగర్, సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు