వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. చివరి తేదీలు ఇవే..

డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana Govt

Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా.. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన వైద్య విద్యను బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Also Read: Paracetamol Usage: పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే.. ఇలా చేయండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది. గడిచిన 18 నెలల్లో 8వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌నర్స్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా.. మరో రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 52 పోస్టులు..
వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 52 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో 42 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలో ఆరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, నాలుగు స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి.

చివరి తేదీ ఇదే..
స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు జులై 12 నుంచి 26వ తేదీ వరకు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 14 నుంచి 25వ తేదీ వరకు. మరిన్ని వివరాలకోసం ఎంహెచ్ఎస్ఆర్బీ వెబ్‌సైట్ లో చూడొచ్చు.

త్వరలో మరిన్ని పోస్టులు..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇటీవల ఆ సంఖ్యను 1300కు పెంచినట్లు తెలిసింది.