Paracetamol Usage: పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే.. ఇలా చేయండి
Paracetamol Usage: పారాసెటమాల్ డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య.

Paracetamol Side effects
పారాసెటమాల్.. ఈ టాబ్లెట్ గురించి తెలియనివారంటూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా చాలా మంది జీవితాల్లో కలిసిపోయింది ఈ టాబ్లెట్. జ్వరం, తననొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు ఇలా చాలా తరుచుగా వచ్చే ప్రతీ సమస్యకు ఇదే పరిష్కారం. ప్రతీ దానికి ఇదే టాబ్లెట్ వాడతారు చాలా మంది. అయితే, రోగం నయం చేసుకోవడానికి ప్రథమ చికిత్సగా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదే కానీ, డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య. ఇంకా చాలా విషయాల గురించి ఆమె వివరించారు. మరి పారాసెటమాల్ అధికంగా వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని నుండి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి డాక్టర్ కావ్య ఎం చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువగా తీసుకుంటే వచ్చే ముఖ్యమైన దుష్ప్రభావాలు:
1.లివర్ ప్రమాదాం (Liver Damage):
పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ శక్తిని కోల్పోతుంది. పని తీరు కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అయ్యే అంత ప్రమాదస్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆల్కహాల్ తాగేవారికి ఇది మరింత ప్రమాదకరం.
2. వాంతులు, నొప్పులు, మలబద్ధకం:
డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య.పారాసెటమాల్ ఓవర్‌డోస్ లో తీసుకోవడం వల్ల అది జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. క్రమంగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు అవుతాయి.
3.చర్మంపై అలర్జిక్ ప్రతిక్రియలు:
పారాసెటమాల్ అధికంగా తీసుకోవడం వల్ల చర్మం సమస్యలు రావచ్చు.మెడిసిన్ రియాక్షన్ వల్ల చర్మంపై ఎర్రటి ర్యాషెస్, వాపు, ముడతలు వచ్చే అవకాశం ఉంది. అరుదుగా వచ్చే SJS అనే తీవ్ర చర్మ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
4.కిడ్నీ సమస్యలు:
పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడి అవి బలహీనంగా తయారవుతాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని వాటి పనితీరు మందగిస్తుంది.
5. మెదడుపై ప్రభావం:
పారాసెటమాల్ అధిక మోతాదులో వాడటం వల్ల మెదడుపై ప్రభావం పది మూర్ఛ, కామాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కనిపించే లక్షణాలు:
- ముందు వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు ఉంటాయి
- 24 గంటల తర్వాత జండిస్(పచ్చకామెర్లు), పసుపు కళ్లు/చర్మం, మూత్రం రంగు మారడం వంటివి జరుగుతాయి.
- ఇంకా తీవ్రమైనప్పుడు గుండె ఆగిపోవడం, మృత్యువుకీ కూడా కారణం కావచ్చు
ఎలా నివారించాలి?
- ఔషధ మోతాదును గమనించాలి. ఒకే రోజులో 500mg మించకుండా చూసుకోవాలి.
- పారాసెటమాల్ వివిధ కంపెనీలలో లభిస్తుంది. విక్స్, డోలో, క్రోసిన్ లాంటివి. కాబట్టి, రెండు రకాల టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకుండా చూసుకోవాలి.
- ఆల్కహాల్ తీసుకునే వారైతే పారాసెటమాల్ టాబ్లెట్స్ తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మద్యపానం వల్ల లివర్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు ఈ పారాసెటమాల్ తీసుకుంటే లివర్ పై ఇంకా ప్రభావం పడుతుంది.
- పిల్లలకు కూడా వారి మోతాదులోనే ఈ మెడిసిన్ ఇవ్వాలి. అందరికీ ఒకే డొసేజ్ ఇవ్వడం ప్రమాదకరం. కొంతమంది ఒకసారి సగం వేసుకొని మరోసారి మిగతా సగం వేసుకుంటారు. ఇలా చేయడం ప్రమాదం అంటున్నారు నిపుణులు.
- నిజానికి పారాసెటమాల్ ఒక సురక్షితమైన ఔషధమే. కానీ, దాన్ని అత్యధికంగా, నిర్లక్ష్యంగా వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్ సూచన లేకుండా దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల అది మందు కంటే విషంగా మారుతుంది. అందుకే ఏ మందైనా వైద్యుడి సలహాతో మాత్రమే వాడాలి.