Telangana Government : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్..శుభకార్యాలకు 100, దహన సంస్కారాలకు 20 మందికి అనుమతి

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 15 వరకు పొడిగించింది.

new guidelines for the corona control : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 15 వరకు పొడిగించింది. మొద‌ట్లో 8వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూని పొడిగించిన ప్ర‌భుత్వం తాజాగా మ‌రోవారం పాటు పొడిగించింది.

పెళ్లిళ్లలాంటి శుభకార్యాలకు 100 మందికి మించకుండా జరుపుకోవాలని ఆదేశించింది. దహన సంస్కారాలకు 20 మందికి మించరాదని సూచించింది.

ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. రాజకీయ సభలు, సాంస్కృతిక సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది.

సామాజిక‌, రాజ‌కీయ‌, క్రీడా, వినోద, విద్య‌, మ‌త‌, సాంస్కృతిక‌ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ప్ర‌జ‌లు భౌతిక‌దూరం పాటించాలని, మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు