Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికి అప్లయ్ చేశారా? మీరు ఈ కేటగిరీలో ఉంటే.. మీకు ఇల్లు రాదు..

ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు జాబితాలుగా విభజించారు.

Indiramma Illu

Indiramma Illu: తెలంగాణలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన పేరుతో సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో మొత్తం 77.18లక్షల మంది తమకు ఇల్లు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేశారు.

Also Read: తెలంగాణలో టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్.. మెమోల విధానంలో కీలక మార్పులు.. సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్లు

ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు జాబితాలుగా విభజించారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలుగా గృహనిర్మాణశాఖ అధికారులు సిద్ధం చేశారు. తద్వారా మొత్తం 36.03లక్షల మంది అర్హులుగా, 41.15లక్షల మంది అనర్హులుగా అధికారులు తేల్చారు.

 

ఎల్-1 జాబితాలో సొంత స్థలాలు ఉండి.. ఇళ్లు లేనివారిని చేర్చారు. ఎల్-2 జాబితాలో స్థలాలు, ఇళ్లు లేనివారిని చేర్చారు. ఎల్-3 జాబితాలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. ఈ ప్రక్రియ ద్వారా ఎల్-1లో 23.05లక్షలు, ఎల్-2లో 21.44లక్షలు, ఎల్-3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ ప్రక్రియను మొత్తం ఫిబ్రవరి నెలలో పూర్తి చేశారు.

 

అయితే, పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో ఎల్-1 జాబితాలో 18.67 లక్షల మంది, ఎల్-2 జాబితాలో 17.36లక్షల మంది అర్హులుగా తేల్చారు. ఎల్-3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నవారిలో 53శాతం మంది అర్హులని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.