Smart Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టింది.
- V Santhosh Kumar
- Published on- August 8, 2026 / 08:55 PM IST
Telangana government to distribute smart ration cards on august 15
- ఆగస్టు 15న స్మార్ట్ రేషన్
- 1.05 కోట్ల మందికి లబ్ధి
- రాష్ట్రవ్యాప్తంగా ఉచిత సన్నబియ్యం పంపిణీ
Smart Ration Cards: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థను డిజిటలైజ్ చేస్తూ, మరింత పారదర్శకత పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో మిగిలిన 32 జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ జరగనుంది. ఈ కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా దాదాపు 3.42 కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యంతో పాటు మెరుగైన ఆహార భద్రత సేవలు అందనున్నాయి.
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. యష్ యాక్షన్ అవతార్ విజువల్ మైండ్ బ్లోయింగ్
పెరిగిన లబ్ధిదారులు, నెలకు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం:
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయడంతో, అదనంగా 61.09 లక్షల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డుల వల్ల భవిష్యత్తులో రేషన్ పంపిణీలో అవకతవకలకు తావులేకుండా సేవలు వేగవంతం కానున్నాయి.
పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, సీఎస్ మార్గదర్శకాలు:
స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీసు శాఖల సమన్వయంతో ముందస్తుగా లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెళ్లను ఏర్పాటు చేస్తూ, ప్రతి జిల్లాలో పంపిణీని పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
