TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఆ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై.. ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కార్మికులు ఆనందం.. TSRTC Merger Bill

Tamilisai Soundararajan - RTC Bill

Tamilisai Soundararajan – TSRTC Bill : ఉత్కంఠకు తెరపడింది. రూట్ క్లియర్ అయ్యింది. టీఎస్ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కీలకమైన ఆర్టీసీ బిల్లుకు(TSRTC Merger Bill) ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) ఓకే చెప్పారు.

ఆర్టీసీ ముసాయిదా బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ అంశాలపై వివరణ ఇచ్చింది. ఆ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై.. ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కేవలం ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు గవర్నర్ కు తెలిపింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే కొనసాగుతుందని వివరణ ఇచ్చింది. కేంద్ర గ్రాంట్ల విషయంలో న్యాయపరమైన వివాదాలకు తావులేదని స్పష్టం చేసింది. ఈ వివరణ పట్ల గవర్నర్ తమిళిసై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.(TSRTC Merger Bill)

Also Read..Jagga Reddy: జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా.. కేటీఆర్‌తో భేటీ అందుకేనా?

గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇక, బిల్లుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం కార్మికులను ఆందోళనకు గురించి చేసింది. ఆర్టీసీ కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. గవర్నర్ వైఖరికి నిరసగా రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. కచ్చితంగా ఇవాళ బిల్లుని ఆమోదించాల్సిందే అంటూ కార్మికులు డిమాండ్ చేశారు.

ఈ పరిస్థితుల్లో పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై ఆర్టీసీ కార్మిక నేతల సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిపారు. బిల్లుకి సంబంధించి తాను కొన్ని ప్రశ్నలు లేవనెత్తానని, దానికి ప్రభుత్వం నుంచి వివరణ రాగానే ఈ రోజు సాయంత్రం సభలో బిల్లును ప్రవేశ పెట్టే విధంగా తాను బిల్లును ఆమోదిస్తానని ఆర్టీసీ కార్మిక నేతల సంఘాలకు హామీ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. అన్నట్టుగానే ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళిసై.

Also Read..Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

బిల్లు విషయంలో గవర్నర్ లేవనెత్తిన 5 అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన వివరణ..

1. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పెన్షన్లు ఇస్తారా?
ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నాం.

2. ఆర్టీసీ కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవు.
కేంద్రం వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదు.

3. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు.
ఆర్టీసీ సంస్థ యథాతధంగా కొనసాగుతుంది.

4. ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు.
కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదు.

5. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్ లో న్యాయం ఎలా చేస్తారు?
పెన్షన్లు ఇతర అంశాలపై ఎలాంటి అయోమయం లేదు.