తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.

Telangana Governor Tamilisai Soundararaja resigns

Tamilisai Soundararaja resigns: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవిని వదులుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళసై సౌందర్య రాజన్ మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమొళి 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెపై గెలుపొందారు.

Also Read: ఎన్నికల వేళ భారత్ ఎటువైపు? దేశంలోని ప్రధాన నేతలు, వారి మైనస్ పాయింట్లు ఇవే..