Governor Tamilsai : గవర్నర్ తమిళిసై ఆదిలాబాద్‌ పర్యటన

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే జనజాతి గౌరవ దినోత్సవ వేడుకలో గవర్నర్ పాల్గొననున్నారు.

Governor

Governor Tamilsai Adilabad tour : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే జనజాతి గౌరవ దినోత్సవ వేడుకలో గవర్నర్ పాల్గొననున్నారు. కేస్లాపూర్‌లో కొలువున్న గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ సమీపంలో దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

గవర్నర్ పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేస్లాపూర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కొమురం భీం విగ్రహానికి రంగులు వేయాలని, ఆ పరిసరాలను శుభ్రపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాగోబా దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి పూజా కార్యక్రమాల నిర్వహణపై వివరంగా అడిగి తెలుసుకున్నారు.

AP High Court : మూడు రాజధానుల పిటిషన్లపై నేటి నుంచి ఏపీ హైకోర్టు విచారణ

అనంతరం ఉట్నూర్‌లోని కొమురం భీం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌ను సందర్శించారు. గవర్నర్ బస చేసే విశ్రాంతి గదులను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు.