Holiday For Three Districts : గణేష్ నిమజ్జనం..ఆ మూడు జిల్లాలకు రేపు సెలవు

గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం(సెప్టెంబర్ 9,2022)న ప్రభుత్వం సెలవు ఇచ్చింది.

Holiday For Three Districts : గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం(సెప్టెంబర్ 9,2022)న ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం (సెప్టెంబర్8,2022) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన సందడి నెలకొంది. శుక్రవారం గణేశ్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై 22 క్రేన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో రేపు హుస్సేన్ సాగర్ చుట్టూ 12వేలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.

Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం..భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌

గణేష్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల తొలగింపుకు 20 జేసీబీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా సాగర్ చుట్టూ ఉన్న 200 సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమరాలను కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రెండింగ్ వార్తలు