Telangana Govt : దసరా సెలవులో మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఉండనున్నాయి.

Dussehra holiday changed
Telangana Govt Changed Dussehra Holiday : దసరా సెలవును తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అక్టోబర్ 24వ తేదీన సైతం సెలవు ప్రకటించింది. నిజానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యత్ సభ అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం దసరా సెలవును మార్చింది.
అయితే ఇంతకముందు ప్రకటించిన సెలవును సైతం కొనసాగించింది. పాఠశాల విద్యార్థులకు సెలవులతోపాటు మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ ప్రారంభం రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా, దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్చిక సెలవు ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఉండనున్నాయి.
Union Labor Department : సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ
తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా అక్టోబర్ 26వ తేదీన కాలేజీలో రీఓపెన్ కానున్నాయి. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎటువంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.