Telangana LRS Fee Discount : తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసీషెన్.. వాళ్లకు భారీ రిలీఫ్.. గడువు పెంపు.. ఏకంగా 25శాతం రాయితీ..

Telangana LRS Fee Discount : రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 131ని విడుదల చేసింది. ఈరాయితీ పథకం 2026 మే1వ తేదీ నుంచి 2026 జులై 31వ తేదీ వరకు అంటే.. మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

Telangana LRS Fee Discount

  • తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
  • ఎల్ఆర్ఎస్ ఫీజుపై 25శాతం రాయితీ
  • మే1 నుంచి జూలై 31వరకు అవకాశం

Telangana LRS Fee Discount : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్దీకరణ వేగవంతం చేసే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీలపై ఏకంగా 25శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Gas Cylinder Rates : బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఒక్కో సిలిండర్‌పై ఎంతంటే.. వారికి మాత్రం ఊరట..

రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 131ని విడుదల చేసింది. ఈరాయితీ పథకం 2026 మే1వ తేదీ నుంచి 2026 జులై 31వ తేదీ వరకు అంటే.. మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రభుత్వం తాజా నిర్ణయంతో గడువులోపు తమ ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించే దరఖాస్తుదారులకు మాత్రమే ఈ 25శాతం డిస్కౌట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనుమతిలేని లేఅవుట్లు విస్తరించిన నేపథ్యంలో వాటిని చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకురావడమే ఎల్ఆర్ఎస్ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియ ద్వారా ప్లాట్లకు లీగల్ స్టేటస్ లభించి, భవన అనుమతులు పొందడం సులభం అవుతుంది. అదేక్రమంలో రిజిస్ట్రేషన్, కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగించొచ్చు.

ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు పొడిగించింది. అయితే, ఈసారి గడువు ముగిసిన తరువాత ఎలాంటి పొడిగింపు లేదా రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన గడువులోపు దరఖాస్తు దారులు 25శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు చివరి రోజు వరకు వేచిఉండకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.