Telangana Cabinet Decisions: జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు
విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపైనా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరుగుతోంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చలు జరుపుతోంది మంత్రి మండలి. ఈ మీటింగ్ లో డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు చేయాలనే భావనలో ఉంది ప్రభుత్వం. దీనిపైనా చర్చించనున్నారు మంత్రులు. అలాగే విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపైనా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. పంటల మార్పిడి దిశగా యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు నిర్ణయం తీసుకోనుంది క్యాబినెట్.
అటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్కూల్స్ తో పాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Also Read: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతితక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే?
