TG Bakrid Holiday : కీలక ప్రకటన.. బక్రీద్ సెలవు దినం మార్పు.. కొత్త తేదీ ఎప్పుడంటే..
TG Bakrid Holiday : బక్రీద్ పండగ సెలవుపై కీలక నిర్ణయం వెలువడింది. సెలవు రోజును మారుస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana government change bakrid 2026 holiday from may 27 to may 28
TG Bakrid Holiday : విద్యార్థులు, ఉద్యోగులకు కీలక అలర్ట్.. బక్రీద్ పండగ సెలవు తేదీ మారింది. కొత్త తేదీని ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సాధారణ సెలవు దినాన్ని మే 27వ తేదీన (బుధవారం) అని ప్రకటించారు. అయితే సెలవు ప్రకటించిన మే 27న హైదరాబాద్ నగరంలో నెలవంక కనిపించనందున ముస్లిం పెద్దలు, సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-దక్కన్ సంస్థ.. బక్రీద్ పండుగ తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. మే 28వ తేదీ, గురువారం బక్రీద్ పండగ జరుపుకోవాలని నిర్ణయించారు. పండగ తేదీ మారడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు రోజును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవంగా బక్రీద్ పండగ సందర్భంగా తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు బక్రీద్ పండగ సందర్భంగా మే 27న సెలవు ప్రకటించింది. అయితే ఇప్పుడు పండగ తేదీ మారడంతో.. సెలవు తేదీని కూడా మార్చాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.
* SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఏ రోజు నుంచి ఎప్పటివరకంటే?
ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ సెలవు దినాన్ని మే 27 నుంచి మే 28కి మారుస్తూ సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీవో నెంబర్ 718 జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులపై సంతకం చేశారు. బక్రీద్ పండుగ తేదీ మార్పుకు ప్రధాన కారణం ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ధుల్-హిజ్జా నెలవంక సకాలంలో దర్శనమివ్వకపోవడమే అంటున్నారు. మే 17వ తేదీన (ఆదివారం) సాయంత్రం రాష్ట్రంలో ఎక్కడా చంద్రదర్శనం కాలేదు. దీంతో ధుల్-ఖాదా నెల 30 రోజులు పూర్తయి, మే 19వ తేదీ మంగళవారం నుండి ధుల్-హిజ్జా మాసం ప్రారంభమైంది.
