Telangana Govt : బీసీ మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈనెల 15వ తేదీ వరకే చాన్స్..
Indiramma Sewing Machine Scheme : తెలంగాణలో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి సంబంధించి ఈనెల 15వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.
- Harish Thanniru
- Published on- September 11, 2026 / 12:25 PM IST
Indiramma Sewing Machine Scheme
Indiramma Sewing Machine Scheme : తెలంగాణలోని బీసీ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, దరఖాస్తుల స్వీకరణకు భారీ స్పందన లభిస్తోంది.
Also Read : Gold Silver Price Today : మహిళలకు భారీ ఊరట.. ఊహించని స్థాయిలో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి సంబంధించి ఈనెల 15వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. 10వ తేదీ నాటికే 2.90 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తొలి విడతలో కుట్టుమిషన్లు అందుకునే అవకాశం 1.19 లక్షల మంది మహిళలకు మాత్రమే ఉంటుంది. మరో నాలుగు రోజులు దరఖాస్తులకు అవకాశం ఉండటంతో.. వీటి సంఖ్య సుమారు 3.5లక్షల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
18 నుంచి 55ఏళ్ల వయస్సు ఉండి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన మహిళలు ఈ పథకానికి అర్హులు. మొదటి విడతలో ఎంపికైన మహిళలకు 100శాతం సబ్సిడీపై (ఉచితంగా) కుట్టు మిషన్ పంపిణీ చేస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ.12వేల వరకు ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ముందుగా మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలోని కమిటీలు దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తరువాత అర్హుల జాబితా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. అక్కడ తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తారు.
