Jobs Notifications
Telangana Jobs Notifications :తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త . తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) గురువారం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 198 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 84 ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీలు (టీఎస్‌టీ), 114 మెకానిక్ సూపర్ వైజర్స్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
టీఎస్‌టీ, ఎంఎస్‌టీ పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉండేలా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. అర్హత కలిగిన, ఆసక్తిగల అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్ సైట్ www.tgprb.inలో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. డిసెంబర్ 30వ తేదీన ఉదయం 8గంటల నుంచి జనవరి 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు వెబ్ సైట్ లో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది. అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులకు ఇచ్చిన సూచనలతో సహా పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో టీఎస్ఎల్‌ఆర్బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొన్నారు.