×
Ad

రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నిజానికి ఈ నెల 17న లేదంటే 18/19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే, ఆ డబ్బులు పడలేదు.

Rythu Bharosa: తెలంగాణ రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా సాయం జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సీజన్‌లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి కచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేసే సర్వే పూర్తికాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి కారణం. ఇప్పుడు సర్వే పూర్తి అయిందని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రకటించారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ఫిబ్రవరి 11న జరిగి, ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో రైతు భరోసా కోసం నిధులను సమీకరించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది.

Also Read: మనం వాడిపడేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో అరుదైన ఖనిజాలు.. వీటిని ఇలా వాడితే భారత్‌కు తిరుగు ఉండదు..

దీంతో రైతు భరోసా పథకం కింద నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాబోయే రెండు, మూడు రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని కొన్ని రోజుల్లో ఒకే దశలో రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పంపిణీ చేయడానికి దాదాపు రూ.9,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, సాగు వ్యవసాయ భూమికి రైతు భరోసా సాయం అందిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఈ నెల 17న లేదంటే 18/19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే, ఆ డబ్బులు పడలేదు. నిధులు ఎప్పుడు వేస్తారన్న దానిపై అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే డబ్బులు పడతాయని తెలుస్తోంది.