తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ.. ఓటర్ల తుది జాబితా ఎప్పుడంటే?

పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Gram Panchayat elections

Gram Panchayat elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read: హైదరాబాద్ లో రేషన్ కార్డుకి అప్లై చేసినా ఇంకా రాలేదా? ఇదే కారణం..!

ముఖ్యాంశాలు ఇవే

  • ఈ నెల 28వ తేదీలోపు గ్రామ పంచాయతీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల ప్రకటన
  • ఈ నెల 29న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులపై సమావేశం
  • ఈ నెల 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలతో మీటింగ్
  • ఈ నెల 30న తొలగింపు, అబ్జెక్షన్లపై వివరాలను తీసుకోనున్న ఎన్నికల కమిషన్
  • ఈ నెల 31న అభ్యంతరాలను తొలగించే ప్రక్రియ
  • వచ్చే నెల 2న గ్రామపంచాయతీలో వారిగా ఫొటోతో కూడిన ఓటర్ల లిస్టు ప్రకటన