Fever Survey: తెలంగాణలో ఫీవర్ సర్వే, లక్షణాలు ఉంటే వైద్య కిట్లు అందజేత

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల కరోనా టెస్టు కిట్లు, కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

Fever Survey:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టారు. ఇంటింటికి ఆరోగ్యం పేరుతో తెలంగాణలోని అన్నీ జిల్లాలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, లక్షణాలున్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.

Also read: Corona Update: దేశంలో 3,47,254 కొత్త కరోనా కేసులు

ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల కరోనా టెస్టు కిట్లు, కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఐసొలేషన్ కిట్లో ఉన్న మందులను ఉపయోగించుకోవాలని, సమస్య తీవ్రంగా ఉన్నవారు.. సమీప ఆరోగ్యకేంద్రానికి గానీ, ఆసుపత్రికి గానీ వెళ్లి చికిత్స తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సరిపడా ఐసోలేషన్ కిట్స్ ను వైద్యశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లోని చాదర్ఘాట్ విక్టోరియా ఇండోర్ స్టేడియంలో కిట్స్ తయారీ, పంపిణీ చేపట్టారు.

Also read:Jagtial 3 Murder: జగిత్యాల మూడు హత్యలపై కొనసాగుతున్న విచారణ, పోలీసుల అదుపులో ఆరుగురు

ప్రతిరోజూ రెండున్నర లక్షల కిట్స్ ని సిద్ధం చేసి, రానున్న 20 రోజుల పాటు అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు. కరోనా రోగులకు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఐసొలేషన్ కిట్ లో గతంలో మాదిరిగానే ఏడు రకాల మందులు అందజేస్తున్నారు. అయితే ఈసారి బ్లాక్ ఫంగస్ కి సంబంధించిన మందులను కూడా పంపిణీ చేయనున్నారు. హోమ్ ఐసొలేషన్ కిట్లతో పాటు, కరోనా నిర్ధారణ అయిన వారికి రోగనిరోధకతను పెంచే పౌష్టికాహారాన్ని కూడా పంపిణీ చేసే ఆలోచనలో వైద్యారోగ్యశాఖ ఉన్నట్లు సమాచారం.

Also read: Flight U turn: ప్రయాణికురాలు మాస్క్ ధరించలేదని “యూ టర్న్” తీసుకున్న విమానం

ట్రెండింగ్ వార్తలు