Corona Update: దేశంలో 3,47,254 కొత్త కరోనా కేసులు

భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Corona Update: దేశంలో 3,47,254 కొత్త కరోనా కేసులు

Covid

Corona Update: భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,18,825కి చేరింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,51,777 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,60,58,806కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి భారిన పడి 703 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,88,396కి చేరింది.

Also read: Jagtial 3 Murder: జగిత్యాల మూడు హత్యలపై కొనసాగుతున్న విచారణ, పోలీసుల అదుపులో ఆరుగురు

ఇక ఇప్పటి వరకు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 71.15 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 19,35,912 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 3170 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 160.43 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 9,692 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Also Read: Flight U turn: ప్రయాణికురాలు మాస్క్ ధరించలేదని “యూ టర్న్” తీసుకున్న విమానం