Telangana High Court (1)
Telangana High Court : తెలంగాణ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగులో తీర్పు ఇచ్చింది. జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ తీర్పు వెలువరించింది. కేరళ తర్వాత తెలంగాణ హైకోర్టు రీజినల్ లాంగ్వేజ్ లో తీర్పు ఇచ్చింది. 44 పేజీల తీర్పు వెల్లడించింది. ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళం తీర్పు వెలువరించింది. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు తెలుగులో తీర్పు ఇచ్చింది.
సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూ వివాదంపై జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన ధర్మాసనం తెలుగులో తీర్పు ఇచ్చింది. నిజానికి సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లీష్ లోనే వెలువరించాల్సివుంటుంది.
Vijayashanti : ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి
సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాషలో ఉంటే వాటిని ఇంగ్లీష్ లోకి అనువధించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించబోవు.
అలాంటిది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు ఇచ్చి న్యాయమూర్తులు కొత్త చరిత్ర సృష్టించారు.
ఈ మేరకు 45 పేజీల తీర్పును తెలుగులో వెల్లడించారు. అప్పీల్ కోసం ఇంగ్లీష్ లోనూ తీర్పు ఇచ్చి ఇంగ్లీష్ తీర్పును ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.