Vijayashanti : ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Vijayashanti..MLA Rajasinghs suspension
Vijayashanti Rajasinghs suspension : ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో బీజేపీ నేత విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ కావటం… జైలుకు వెళ్లటం.. ఆ తరువాత కొంతకాలానికి బెయిల్ పై విడుదల కావటం జరిగింది. దీంతో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటినుంచి అది కొనసాగుతోంది. దీనిపై రాజాసింగ్ కూడా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ అరెస్ట్ తరువాత బీజేపీ అధిష్టానం రాజాసింగ్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించటంలేదనే చెప్పాలి. అయినా ఆయన మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. తనకున్న టెంపర్ కు బీజేపీ తప్ప ఏ పార్టీ సెట్ కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయినా బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటికీ స్పందించలేదు.
కాగా తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుకుంటున్నారు. సస్పెన్షన్ పై అధిష్టానం ఆలస్యం చేస్తోందని దాన్ని వెంటనే ఎత్తివేయాలని లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత విజయశాంతి రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యమవుతోందని.. దాన్ని వెంటనే ఎత్తివేయాలని లేదంటే పార్టీని నష్టం జరుగుతుంది అంటూ ట్విటర్ వేదికగా స్పందించారు. విజయశాంతి చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
Bandi Sanjay : ఉత్సవాల పేరుతో 5లక్షల కోట్లు అప్పు చేశారు, తెలంగాణ రావొద్దని కోరుకున్నారు- బండి సంజయ్
విజయశాంతికి ఉన్న అభిప్రాయమే తెలంగాణ నేతల్లో కూడా ఉంది. బండి సంజయ్ కూడా అదే కోరుకుంటున్నారు. అలాగే మరో బీజేపీ నేత దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కూడా అదే కోరుకుంటున్నారు. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం కొంత ఆలస్యమవుతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. విజయశాంతి కూడా తన ట్వీట్ లో అనే పేర్కొన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ విజయంలో బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. రాజాసింగ్ విషయంలో బండి సంజయ్ రెండుసార్లు అధిష్టానానికి లేఖ రాశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. కానీ త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్న క్రమంలో ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్న తెలంగాణ నేతలు అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదే వేచి చూడాలి.