High Court : దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిళ్లలో 5 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ

ఎఫ్‌డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు.

High Court (2)

Director N. Shankar Land  Allotment : సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిళ్లలో 5 ఎకరాల భూమి కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కరీంనగర్ కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిగింది. కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ.5 లక్షలకే కేటాయించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇక్కడ స్టూడియోలు పెట్టడం వలన బాలీవుడ్ కళాకారులూ వస్తూ ఉంటారని శంకర్ తరపు న్యాయవాది తెలిపారు. చాలా మందికి ఉపాధి అవకాశం ఉంటుందని ఏజీ అన్నారు.

ఎఫ్‌డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు. శంకర్ నాలుగు దశాబ్దాల నుండి సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో ఉన్నాడని, అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఈ పిటిషన్ వేసిన పిటిషనర్ సారం లేని ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడని ఏజీ వాదించారు.

Raj Thackeray : ఎన్సీపీలో చీలిక వెనుక శరద్ పవార్ హస్తం.. రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

భూపెన్ హాజరే, సత్య జీత్ రే వాళ్ళ సొంత రాష్ట్ర ప్రభుత్వాలను గౌరవించాయని హైకోర్టు తెలిపింది. వాళ్ళు తమ రాష్ట్ర వాసులు కావడం తమకు గర్వ కారణం అని భావించాయని తెలిపింది. ఇందులో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. క్రీడాకారులు, కళాకారులు, స్టూడియోల కోసం ప్రభుత్వాలు భూములు ఇచ్చారని హైకోర్టు తెలిపారు. శంకర్ కు సినీ రంగంలో ప్రత్యేక నైపుణ్యం ఉందని చెప్పారు.

సినీ పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడాలంటే నిపుణులు అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం శంకర్ కు భూ కేటాయించిందన్నారు. అది కూడా న్యాయమైన రేటు వసూలు చేశాకే భూమి ఇచ్చిందని శంకర్ తరపు న్యాయవాది తెలిపారు. చాలా మంది క్రీడా కారులు, దేశానికి బంగారు పతాకాలు తెచ్చినప్పుడు ప్రభుత్వాలు భూములు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని హైకోర్టు తెలిపింది.

JC Prabhakar Reddy : సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదు… హత్య : జేసీ ప్రభాకర్ రెడ్డి

భూమి కేటాయించడం సరైంది కాదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కావాలంటే సినీ అభివృద్ధి కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమమించండి అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తాము ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దర్శకుడు ఎన్.శంకర్‌కు భూకేటాయింపుపై వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రీజర్వ్ చేసింది. జులై 7న తీర్పు ఇస్తామని తెలిసింది.