JC Prabhakar Reddy : సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదు… హత్య : జేసీ ప్రభాకర్ రెడ్డి

సీఐ ఆనందరావు సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని తెలిపారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. పోలీసులు దాన్ని బయట పెట్టాలన్నారు.

JC Prabhakar Reddy : సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదు… హత్య : జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy

Updated On : July 5, 2023 / 12:13 PM IST

CI Ananda Rao Death : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు మృతిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యల చేశారు. సీఐ ఆనందరావుది ఆత్మహత్య కాదు.. హత్య అని ఆరోపించారు. సిఐ ఆనందరావు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడని పేర్కొన్నారు. పోలీస్ అసోసియేషన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో తమ అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని ఇష్యూ చేశారు… ఇప్పుడు ఒక సీఐ చనిపోతే అసోషియేషన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందవని సీఐ కుటుంబ సభ్యులను బెదిరిస్తారా అని పేర్కొన్నారు. “మా నాన్న తాడిపత్రిలో పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నానని సిఐ కుమార్తె చెప్పింది” అని అన్నారు. ఓ కేసులో వైసీపీ నాయకుడు పేరు తొలగించాలని సీఐపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తెల్లవారుజామున 4:10 కి ఏమి పని ఉందని ఆత్మహత్య చేసుకున్న సీఐ ఆనందరావు ఇంటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారని ప్రశ్నించారు.

MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

సీఐ ఆనందరావు సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని తెలిపారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. పోలీసులు దాన్ని బయట పెట్టాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీఐ ఆత్మహత్యపై విచారణ జరుపుతామని చెప్పారు. సీఐ ఆనందరావు కుటుంబానికి….పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ ఆత్మహత్య కేసును టీడీపీ ప్రభుత్వం వచ్చాక రీ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.