Schools Open: సెప్టెంబర్ 1నుంచి స్కూల్స్ ఓపెన్.. కండీషన్స్ అప్లై

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ తెరుచుకోవచ్చంటూ అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం...

Schools Open: సెప్టెంబర్ 1నుంచి స్కూల్స్ ఓపెన్.. కండీషన్స్ అప్లై

Schools Open

Updated On : August 31, 2021 / 6:59 PM IST

Schools Open: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ తెరుచుకోవచ్చంటూ అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం మూసే ఉంచాలని ఆంక్షలు విధించారు. స్కూల్స్ ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించాలా వద్దా అనేది వారి నిర్ణయానికే వదిలేశారు.

తెలంగాణ హైకోర్టు స్కూల్స్ ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. స్కూల్ మేనేజ్మెంట్ ఏ విద్యార్థిని స్కూల్ కు రావాలంటూ బలవంత పెట్టకూడదని ఆదేశించారు. పేరెంట్ కు ఇష్టం లేకుండా పిల్లలను బడికి పంపాల్సిన అవసర్లేదని తెలిపింది.

ప్రభుత్వం ముందుగా ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను అనుమతించాలని హైకోర్టును కోరింది. కాకపోతే దానికి పేరెంట్స్ స్కూల్స్ తెరవొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.