Teachers Transfers : టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. Teachers Transfers

Teachers Transfers

Teachers Transfers – Telangana : తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను సవరించింది హైకోర్టు. టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లు కేటాయించడాన్ని తప్పు పట్టింది.

యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు లేకుండానే ట్రాన్సఫర్లకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. మరోవైపు ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశం అన్న హైకోర్టు.. తుది తీర్పును లోబడే బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది.

Also Read: అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ.. భారీ మెజార్టీ ఖాయమా?

ఉపాధ్యాయుల బదిలీల అంశం సుమారు 8 నెలలుగా పెండింగ్ లో ఉంది. ఇవాళ బదిలీలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ ట్రాన్సఫర్లకు సంబంధించి యూనియన్ నేతలకు పది పాయింట్లు అదనంగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నాన్ స్పౌస్ టీచర్ల సంఘాలు హైకోర్టుని ఆశ్రయించాయి. సుమారు 70వేల మందికిపైగా ఉన్న టీచర్ల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ న్యాయ సమస్యలో ఉన్నందున వీటన్నింటి చిక్కులు వీడే వరకు బదిలీల ప్రక్రియ చేపట్టొదని నాన్ స్పౌస్ టీచర్లు కొంతకాలం క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై గతంలో విచారించిన కోర్టు మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టొద్దని స్టే విధించింది. అప్పటి నుంచి బదిలీలను నిలిపివేసిన కోర్టు.. ఇవాళ ఎట్టకేలకు మరొకసారి విచారణ చేపట్టింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో టీచర్ల బదిలీలపై ఉన్న స్టేను వెకేట్ చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కమిషనర్

యూనియన్ నేతలకు పది పాయింట్లు కేటాయించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఏ విధంగా వారికి అదనపు పాయింట్లు కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచర్ల బదిలీలకు ఓకే చెప్పిన కోర్టు.. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇవాళ కోర్టు తెరదించిందని చెప్పొచ్చు.