Hyderabad : గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కమిషనర్

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే అతడు పడిపోయాడు. Hyderabad - CPR

Hyderabad : గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కమిషనర్

Hyderabad - CPR (Photo : Google)

Hyderabad – CPR : గుండెపోటు.. జనాలను భయపెడుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు వస్తుందో తెలియదు.. సడెన్ గా అటాక్ చేస్తుంది. రెప్పపాటులో ప్రాణాలు తీస్తోంది. చిన్న, పెద్ద తేడా లేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారికి సైతం సడన్ గా గుండెపోటు వస్తుంది. అయితే, సరైన సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఏ మాత్రం చికిత్స ఆలస్యం అయినా మరణం తధ్యం.

గుండెపోటు కేసుల్లో బాధితుడికి తక్షణమే చేయాల్సిన చికిత్స సీపీఆర్. అవును, సీపీఆర్ చేయడం ద్వారా బాధితుడి ప్రాణాలను కాపాడొచ్చు. చాలా కేసుల్లో ఇది ప్రూవ్ అయ్యింది. సీపీఆర్ చేయడం ద్వారా అనేకమంది ప్రాణాలు నిలిచాయి. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్. (Hyderabad)

Also Read..Wearing Socks : రాత్రి సమయంలో సాక్స్ ధరించి నిద్రపోయే అలవాటుందా ? అయితే ఇన్ఫెక్షన్స్ ముప్పు తప్పదంటున్న నిపుణులు

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే అతడు పడిపోయాడు. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఇది గమనించారు. వెంటనే ఆయన స్పందించారు. కానిస్టేబుల్స్ సాయంతో ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. అతడి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించిన సీపీఆర్ చేయడంతో బాధితుడిలో కదలికలు వచ్చాయి.

ఆ వెంటనే అతడిని అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆ వ్యక్తికి చికిత్స అందించారు. దాంతో ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. సకాలంలో సీపీఆర్ చేయడంతో బాధితుడి ప్రాణాలు దక్కినట్టుగా వైద్యులు వెల్లడించారు.(Hyderabad)

సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ అదనపు కమిషనర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్వయంగా మంత్రి హరీశ్ రావు స్పందించారు. సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు అంటూ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని అభినందించారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియను నేర్చుకోవాలని, అవగాహన పెంచుకోవాలని.. తద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడొచ్చని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (Hyderabad)

Also Read..Yoga and Gym : యోగా , జిమ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

కాగా, గుండెపోటు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసే వారికి సీపీఆర్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నం ఫలితాలను ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుండెపోటు వచ్చిన సమయంలో సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.