తెలంగాణలో మార్చి 25న ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహించింది. ఇంటర్‌లోని అన్ని సబ్జెక్టుల పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.
ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి 19కి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు 2024 ఏప్రిల్ 24న రిలీజ్ అయ్యాయి.
Also Read: అందుకే రతన్ టాటా ఇంత గొప్పవారయ్యారు.. ఆస్తులను ఎవరికి రాసిచ్చారో తెలుసా?
ఈ ఏడాది మార్చి 25న పరీక్షలు ముగిశాయి. దీంతో ఈ నెల చివరిలోగా ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్షల ఫలితాలు వచ్చాక tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు. కాగా, 2023, 2022లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వరుసగా మే 9, జూన్ 28న వచ్చాయి. గత ఏడాది బోర్డు పరీక్షలకు మొత్తం 9,81,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 60.01 శాతం కాగా, రెండో సంవత్సరం పరీక్షలలో ఇది 64.19 శాతంగా నమోదైంది.
గత సంవత్సరం తెలంగాణ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 1,86,025 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారు. 68,985 మంది విద్యార్థులు బీ గ్రేడ్, 23,968 మంది అభ్యర్థులు సీ గ్రేడ్, 8,283 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించారు.