Ratan Tata: రూ.3800 కోట్ల ఆస్తులను రతన్ టాటా ఎవరికి రాసిచ్చారో తెలుసా..! అందుకే ఆయన అంత గొప్ప వారయ్యారు..
రతన్ టాటా బ్యాంకు ఎఫ్‌డీలు, గడియారాలు, పెయింటింగ్‌లు వంటి ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుంది.

ratan tata
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన రూ.3,800 కోట్ల సంపదలోని అధిక భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు దానం చేశారు. కోర్టు పేపర్లను పరిశీలించి జాతీయ మీడియా ఎకనామిక్ టైమ్స్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థలకు అధిక భాగం సంపద వెళ్తుంది.
రతన్ టాటా 86 సంవత్సరాల వయస్సులో గత ఏడాది అక్టోబర్ 9న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. రతన్ టాటా బ్యాంకు ఎఫ్‌డీలు, గడియారాలు, పెయింటింగ్‌లు వంటి ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుంది.
ఆ ఆస్తులలో మూడింట ఒక వంతు (రూ.266.67 కోట్లు)ను తన సవతి సోదరీమణులు షిరీన్ జెజీభోయ్, డీనా జెజీభోయ్‌లకు రాశారు. మరో మూడింట ఒక వంతు ఆస్తుల(రూ.266.67 కోట్లు)ను టాటాకు సన్నిహితంగా ఉండే టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి మోహిని ఎం దత్తాకు ఇచ్చారు.
Also Read: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి? ఆయన మేనల్లుడు ఏమన్నాడంటే?
రతన్ టాటా తన జుహు బంగ్లా నుంచి తన సోదరుడు జిమ్మీ నావల్ టాటా (82)కు కొంత వాటాను కేటాయించారు. అలీబాగ్‌లోని ప్రాపర్టీతో పాటు, మూడు గన్‌లను తన స్నేహితుడు మెహిల్ మిస్త్రీ పేరు మీద రతన్ టాటా రాశారు.
రతన్ టాటాకు చెందిన ఈ సంపదను కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు ఆరు నెలలు పడుతుంది. రతన్ టాటా తన పెంపుడు జంతువుల సంరక్షణ కోసం రూ.12 లక్షల నిధులు కేటాయించారు. ప్రతి మూడు నెలలకు రూ.30వేల చొప్పున కుక్కల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రతన్ టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా, మిత్రుడిగా వ్యవహరించిన శంతనుకు గతంలో ఆయన కాస్త డబ్బు ఇచ్చారు. ఆ రుణాన్ని రతన్ టాటా తన వీలునామాలో మాఫీ చేశారు. రతన్ టాటా పొరుగింటి వ్యక్తి జేక్ మాలిటేకు ఇచ్చిన రూ.23 లక్షలు అప్పును కూడా మాఫీ చేశారు. రతన్ టాటాకు విదేశాల్లో దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.