Inter Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం

Inter Exams: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధన..

Exams 2024

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంది. అరగంట ముందు పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించారు అధికారులు.

పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర వైద్య కేంద్రం, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల లోపలికి సిబ్బంది కూడా ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.

పరీక్షా కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 36 పరీక్షా కేంద్రాల్లో 9,277 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 19 వరకు జరగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

ట్రక్కు బోల్తా.. 14 మంది ప్రయాణికుల మృతి.. మరో 21 మందికి తీవ్రగాయాలు