ట్రక్కు బోల్తా.. 14 మంది ప్రయాణికుల మృతి.. మరో 21 మందికి తీవ్రగాయాలు

Road Accident: గ్రామానికి చెందిన వారు ఓ కార్యక్రమంలో పాల్గొని దేవరి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.

ట్రక్కు బోల్తా.. 14 మంది ప్రయాణికుల మృతి.. మరో 21 మందికి తీవ్రగాయాలు

Road Accident

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఓ ట్రక్కు బోల్తా పడి 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కలెక్టర్‌ వికాస్‌ మిశ్రా మాట్లాడుతూ.. క్షతగాత్రులను షాహ్‌పుర ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఓ గ్రామానికి చెందిన వారు ఓ కార్యక్రమంలో పాల్గొని దేవరి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. బడ్జర్ గ్రామ సమీపంలో ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నామని చెప్పారు.

ఈ ఘోర ప్రమాదంపై సీఎం మోహన్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు.

Jharkhand Train Accident : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 12 మంది దుర్మరణం!