ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంపు

Revanth Reddy: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. యూనిఫామ్ సర్వీసులు మినహా...

Telangana Government Jobs

సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది.

బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇవ్వకపోడంతో నిరుద్యోగులు వయసు పెరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు వయోపరిమితిని పెంచుతామని తెలిపారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక TSPSC ప్రక్షాళనను రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో TSPSC నిర్వహించిన పరీక్షల లీకేజీలు జరగడంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Read Also: ఆ రెండు రోజుల్లో వేలాది పెళ్లిళ్లు.. సెలవులు కావాలి: అసెంబ్లీలో మల్లారెడ్డి 

ట్రెండింగ్ వార్తలు