ఆ రెండు రోజుల్లో వేలాది పెళ్లిళ్లు.. సెలవులు కావాలి: అసెంబ్లీలో మల్లారెడ్డి

ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నానని అసెంబ్లీ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

ఆ రెండు రోజుల్లో వేలాది పెళ్లిళ్లు.. సెలవులు కావాలి: అసెంబ్లీలో మల్లారెడ్డి

Malla Reddy: తెలంగాణ అసెంబ్లీలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నానని అసెంబ్లీ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ సహా ఎమ్మెల్యేల ముఖాల్లో చిరునవ్వులు కనపడ్డాయి.

మరోవైపు, శాసన సభ లో తమకు కూడా పవర్ పాయింట్ ప్రేజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను బీఆర్ఎస్ శాసన సభా పక్షం కోరింది. కడియం శ్రీహరి మాట్లాడుతూ… కృష్ణాలో నీటి వాడకాన్ని బట్టి కేటాయింపులు జరిగాయని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల, ఏపీకి 512 టీఎంసీల నీళ్లు వాడుకునేలా ఒప్పందం ఉందని చెప్పారు.

ఇవాళ అసెంబ్లీ, మండలిలో బడ్జెట్, కృష్ణా జలాలపై సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2024- 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీని కృష్ణా జలాల వివాదం హీటెక్కించింది. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం సభను కూల్ చేశాయి.

కాగా, పెళ్లిళ్లకు ఫిబ్రవరిలో 13 నుంచి మూడు రోజులు అలాగే, 17 ,18, 24, 28 ,29 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయి. ఇక మార్చిలో 2, 3, 15, 16, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.