Rains in Telangana
Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని తెలిపారు.
అలాగే, అదే సమయంలో రాష్ట్రంలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వివరించారు. తెలంగాణలో కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, కేరళతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్