Telangana covid
Covid-19 : తెలంగాణ లో ఈరోజు కొత్తగా 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,92,435 కి చేరింది. ఈరోజు 32మంది కోవిడ్ నుంచి కోలుకోగా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 7,87,933 కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 391 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రజారోగ్యశాఖఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీరేటు 99.43 శాతంగా ఉంది. ఈరోజు అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 30 కేసులు నమోదయ్యాయి.
Also Read : China Covid : చైనాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాలు పెరుగుతాయి
ఈరోజు రాష్ట్రంలో మొత్తం 16,315 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో మొదటి,రెండవ, ప్రికాషన్ డోసులు తీసుకున్నవారు ఉన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 6,30,09.890 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,41,636 వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి.
Telangana Covid Report