Minister Ktr Setairs On The Bjp Government And The Congress Party
Telangana : కాంగ్రెస్ కు కులపిచ్చి..బీజేపీకి మతపిచ్చి రెండూ పిచ్చి పార్టీలే..మనకు కులపిచ్చోడు వద్దు..మతపిచ్చోడు వద్దు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జాతీయపార్టీలను ఏకిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏదో టూర్ కు వచ్చినట్లుగా తెలంగాణకు వచ్చి ఒక్కఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని కానీ కాంగ్రెస్ కు చరిత్ర తప్ప భవిష్యత్తు అనేదే లేదని విమర్శించారు. కాంగ్రెస్ కు ఒక్కసారి కాదు 50 ఏళ్లు ఛాన్స్ ఇస్తే నీళ్లు లేవు. విద్యుత్ లదు.పెన్షన్ల మాటేలేదంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
ఇటువంటి పార్టీల వల్ల మన తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు. మనకు కావాల్సిందల్లా అభివృద్ధి..సంక్షేమమే నని అన్నారు. అగ్నిపథ్ అనే పథకంతో బీజేపీ ప్రభతు్వం దేశాన్ని రావణకాష్టంలా మార్చివేసిందని దేశంలో యువత పెట్టకున్న ఆశల్ని అడియాలు చేసిందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు బీజేపీకి అధికారం ఇస్తే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొస్తామని గప్పాలు కొట్టారని రెండోసారి అధికారంలోకి వచ్చిన నల్లధనం మాటే ఎత్తటంలేదన్నారు. నల్లధనం గురించి ప్రశ్నిస్తే ప్రధాని మోడీ తెల్లముఖం వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎవరొచ్చి ఎన్ని కారుకూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకు కేటీఆర్ సూచించారు. అభివృద్ధి..సంక్షేమాలను అందించే కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటూ కేటీఆర్ నాగర్ కర్నూల్ పర్యటనలో చెప్పుకొచ్చారు.