MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు.. కైవసం చేసుకుంది ఆరుకు ఆరు
తాజాగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది

Mlc Election Results
MLC Election Results : తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. కరీంనగర్ జిల్లాలో నెక్ టూ నెక్ పోటీ ఉంటుందని అందరు భావించారు.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ రావు, ఎల్.రమణ విజయం సాధించారు.
చదవండి : MLC Elections : ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్
ఇక మెదక్ నుంచి యాదవ రెడ్డి రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థిపై 524 ఓట్లతో విజయం సాధించారు ఈయన. నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు.. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి అత్యధికంగా 691 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి నగేష్ సరైన పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ఖమ్మంలో కూడా కారు హవానే నడిచింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు ఘనవిజయం సాధించారు. ఆదిలాబాద్‌లో దండే విఠల్ విజయం సాధించారు.