×
Ad

Municipal Elections: మోగిన నగారా.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపటి నుంచే

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Municipal Elections Representative Image (Image Credit To Original Source)

  • ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు
  • ఫిబ్రవరి 13న కౌంటింగ్
  • రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Municipal Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాల వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2వేల 996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 30. ఈ నెల 31వ తేదీన స్క్రూటీని ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3. మొత్తం ఓటర్ల సంఖ్య 52 లక్షల 43వేలు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25 లక్షల 62వేలు కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26 లక్షల 80వేలు. ఇతర ఓటర్ల సంఖ్య 640.

జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. అటు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని మహేశ్ భగవత్ తెలిపారు.

నామినేషన్ల నుంచి ఎన్నికల వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 16న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 8వేల 203. 16వేల 031 బ్యాలెట్ బాక్సులు రెడీ చేశారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యం సహకరిస్తే పోటీ చేస్తా.. లేదంటే..: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి